Hanu Raghavapudi-Prabhas: ప్రభాస్ 26వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..టైటిల్ తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే!

Hanu Raghavapudi-Prabhas: ప్రభాస్ 26వ సినిమాకి గ్రీన్ సిగ్నల్..టైటిల్ తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే!

డైరెక్టర్ హనురాఘవపుడి (Hanu Raghavapudi) బెస్ట్ స్టోరీ టెల్లర్గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అందాల రాక్షసి మూవీతో ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసిన హను..రీసెంట్ సీతారామం వరకు అంతే ఇంటెన్సిటీ లవ్ ఎమోషన్ను తన మూవీస్లో క్యారీ చేస్తున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో హను రాఘవపూడి తన నెక్స్ట్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.  కానీ, ఇది నిన్నటి వరకు రూమర్ గానే ఉండేది.ఇక ఆ రూమర్స్ కి ఎండ్ కార్డు పడేలా ఈ క్రేజీ కాంబో నిజంగానే సెట్ అయినట్లు సమాచారం.

ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవల ముగిసినట్లు తెలుస్తోంది. హను కంప్లీట్ చేసిన బౌండెడ్ స్క్రిప్ట్ ను ప్రభాస్ కు వినిపించగా పచ్చజెండా ఊపాడు. అక్టోబరు నుండి ఈ మూవీ షూటింగ్ ని షురూ చేయనున్నారు. ఈ సినిమాకు “ఫౌజీ” (Fauji) అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇప్పటికే దీన్ని నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో కూడా రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఇక, ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం.

రీసెంట్ గా ఓ ఈవెంట్లో పాల్గొన్న డైరెక్టర్ హను ఈ విషయంపై మాట్లాడుతూ..‘నా నెక్స్ట్ ఫిల్మ్ ప్రభాస్‌తో ఉంటుంది.అది పూర్తిస్థాయి పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు తెలిపారు. ఇదొక చారిత్రక ఫిక్షన్ ఫిల్మ్.అన్ని అనుకున్నట్లుగానే సినిమా కోసం మంచి కథ కుదిరింది.ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్‌ ఈ సినిమా కోసం ఓ మూడు పాటలు కూడా కంపోజ్‌ చేశారు’ అని హను చెప్పారు.

అంతేకాకుండా..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్  కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ను బడా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుందని..త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని హను వెల్లడించారు.దీంతో ఈ ప్రాజెక్ట్‌ కన్ఫమ్ అనే న్యూస్ వస్తుండటంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ మూవీలో హీరోయిన్గా సీతారామం ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ను ఎంపిక చేశారన్న న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆరడుగుల అందాగాడైన ప్రభాస్ తో..ఈ అందాల బ్యూటీ నటించడం ఇది ఫస్ట్ టైం కాగా..ప్రభాస్ తో నటించడానికి మరి ఉత్సహంగా ఉందంట హను సీత. ఈ మెస్మరైజింగ్ కాంబినేషన్ సెట్ అయితే ఫ్యాన్స్ కు పండుగనే చెప్పుకోవాలి. కాగా మరోకొత్త హీరోయిన్ ను హను సెలెక్ట్ చేసినట్లుగా టాక్ కూడా ఉంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. 

ప్రస్తుతం ప్రభాస్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తో కల్కి2, ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2,  ఇక మరోపక్క మారుతి, సందీప్ వంగా మూవీస్ను లైన్ లో పెట్టేశారు. ఇక హను రాఘవపూడి మూవీ రిలీజ్ కావడానికి కనీసం రెండేళ్లు పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో హను రాఘవపూడి వెయిట్ చేస్తాడో..లేక అంతలోపు వేరే మూవీని డైరెక్ట్ చేస్తాడో చూడాలి మరి.