PrabhasHanu Film: ప్రభాస్..హను రాఘవపూడి సినిమా లాంచ్ ఈవెంట్‌ ఫోటోలు చూశారా?

PrabhasHanu Film: ప్రభాస్..హను  రాఘవపూడి సినిమా లాంచ్ ఈవెంట్‌ ఫోటోలు చూశారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), పాన్ ఇండియా లెవల్లో భారీ హిట్టు కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబోలో సినిమా రాబోతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం ఆగస్ట్ 17న గ్రాండ్ గా జరిగింది.

ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మేకర్స్ ఫొటోస్ షేర్ చేశారు. "యుద్ధం, న్యాయం మరియు అంతకు మించి సాగే ఎపిక్..త్వరలో షూటింగ్‌ ప్రారంభమవుతుంది అని ట్వీట్ చేయగా..'ఎప్పటిలాగే అందరి ప్రేమ మరియు మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను' అంటూ డైరెక్టర్ హను తెలిపారు. ప్రస్తుతం ఈ పూజా ఈవెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సీతారామం మూవీకి అద్భుతమైన మ్యూజిక్ అందించిన విశాల్ చంద్రశేఖర్(Vishal Chandrashekhar) సంగీతాన్ని అందిస్తున్నాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. రెండవ ప్రపంచయుద్ధం నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాలో ప్రభాస్ యుద్ధవీరుడిగా ఆర్మీ మ్యాన్ లా కనిపించనున్నాడట. 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఇమాన్ ఎస్మాయిల్ ప్రభాస్‌ సరసన నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో ఇమాన్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. అంతేకాదు లాంచ్ ఈవెంట్‌లో ఆమె ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. దాదాపు ఈ ప్రాజెక్ట్ లో కొత్త బ్యూటీ ఇమాన్ కన్ఫమ్ అంటున్నాయి సినీ వర్గాలు. ఇమాన్ హీరోయిన్ గా, డ్యాన్సర్ గా తన టాలెంట్ ని నిరూపించుకుంటూ సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Imanvi (@iman1013)

మరోవైపు 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఈ వార్తలను ఆమె ఇటీవలే కొట్టపారేసింది త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడిన ఈ సినిమా..రిలీజ్ తరువాత ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.