పీసీసీ చీఫ్‍ ను ఆయన నివాసంలో కలిసిన డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల

పీసీసీ చీఫ్‍ ను  ఆయన నివాసంలో కలిసిన డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల

హనుమకొండ సిటీ, వెలుగు: హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్​గా ఇటీవల నియమితులైన కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి ఆదివారం పీసీసీ చీఫ్‍ మహేశ్‍ కుమార్‍ గౌడ్‍ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలపేతమే లక్ష్యంగా సీనియర్‍ నాయకులతో కలిసి పని చేస్తున్నారని పీసీసీ చీఫ్ అభినందించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని, స్థానిక ఎన్నికలతోపాటు రాబోయే ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ జెండా ఎగురవేయాలని సూచించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.