వరద సహాయ పనులకు రూ.3 కోట్లు

వరద సహాయ పనులకు రూ.3 కోట్లు

హనుమకొండ, వెలుగు: భారీ వర్షాలకు కలిగిన నష్టం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హనుమకొండ జిల్లాకు రూ.3 కోట్లు కేటాయించిందని, నష్టానికి సంబంధించిన వివరాలు అధికారులు వెంటనే సమర్పించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ లో బుధవారం అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నష్టం వివరాలు, ఏయే పనులకు ఎన్ని నిధులు అవసరమో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, ఆర్అండ్​బీ ఈఈ సురేశ్​బాబు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈవో వాసంతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.