
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం (Guntur Karam) సినిమా ఈ సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా అదే రోజు తేజ, ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందిన హనుమాన్ (Hanuman) సినిమా రిలీజ్ అవుతోంది.
చిన్న సినిమా అయినా కూడా..చేస్తోన్న ప్రమోషన్స్తో హనుమాన్కి పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. హనుమాన్ను వాయిదా వేయించేందుకు గుంటూరు కారం టీమ్ నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ హనుమాన్ మేకర్స్ వెనక్కి తగ్గలేదు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ హనుమాన్ యూనిట్ సభ్యులపై కోపంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో హనుమాన్ హీరో తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు మహేష్ బాబు ఫ్యాన్స్ ను కాస్త శాంత పరిచే విధంగా ఉన్నాయి.
‘మహేష్ సర్ సినిమాకు మా సినిమా ఎలాంటి పోటీ కానే కాదు. అయినా మేము మహేష్ సర్ సినిమాకి పోటీగా రావడం లేదు, మహేష్ సార్ తో కలిసి వస్తున్నాం అన్నాడు.’ఇక వెంటనే డైరెక్టర్ ప్రశాంత్..తేజ చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ..సరిగ్గా చెప్పావ్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను..వీరిద్దరూ కొంత కూల్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక సినిమాల రిలీజ్ రోజు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేది చూడాలి.
#SuperStar tho poti enti sir ?♂️?
— Teja Sajja (@tejasajja123) January 2, 2024
అయన తో పోటీగ కాదు సర్
అయన తో పాటుగ https://t.co/EaSpkdjkp8
మహేష్..తేజ కాంబో చూసుకుంటే..2000 వ సంవత్సరంలో వచ్చిన యువరాజు సినిమాలో మహేష్ బాబు కొడుకు పాత్రలో తేజ నటించాడు.ఇప్పుడు 2024 సంక్రాంతికి తన హను-మాన్ సినిమాతో మహేష్ గుంటూరు కారంతో పాటుగా తన సినిమాను తీసుకువస్తున్నాడు.
Well said ?? https://t.co/gLRWI8oICt
— Prasanth Varma (@PrasanthVarma) January 2, 2024