సూర్యాపేట జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి

సూర్యాపేట జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అలంకార్ సెంటర్ లో శ్రీరామ్ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా  సుధాకర్ పీవీసీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త మీలా మహదేవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి , కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పూజా కార్యక్రమాల్లో శ్రీరామ్ సేవా సమితి సభ్యులు తోట శ్యాంప్రసాద్,  కాసం జగన్, మహంకాళి రమేశ్, మోరిశెట్టి శ్రీధర్, వీరవెల్లివిజయ్, తదితరులు పాల్గొన్నారు.

కోదాడ,వెలుగు: హనుమాన్ జయంతి వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, నీరాజనా మంత్రపుష్పాలు, హనుమాన్ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. పట్టణంలోని శ్రీరంగాపురం లో గల ఆంజనేయ స్వామి దేవాలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి  దేవాలయంలో ఉన్న హనుమాన్ ఆలయం, కోదండ రామాలయంలో, బాలాజీ నగర్ లో ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయల్లో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు కనుల పండువగా నిర్వహించారు.