హనుమాన్ కు నార్త్ అమెరికా జేజేలు

హనుమాన్ కు నార్త్ అమెరికా జేజేలు

టాకీస్: హనుమాన్ సినిమా విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మన ఇండియా సూపర్ హీరోకి నార్త్ అమెరికా కూడా జేజేలు కొడుతోంది. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యింది. ఆ సెంటర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో హనుమాన్ చోటు దక్కించుకుంది. హనుమాన్ మూవీ ఎన్నో సూపర్ హిట్ సినిమాల కలెక్షన్స్ ని, స్టార్ హీరోల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసింది. ఇది హనుమాన్ మూవీ బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి. 

ఫస్ట్ మండే హనుమాన్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కన్నా ఎక్కువ రాబట్టింది అంటే హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజులో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మూవీ దెబ్బకి సాహో, ఆదిపురుష్ సినిమాల నార్త్ అమెరికా కలెక్షన్స్ ప్రమాదంలో పడ్డాయి. ఆదిపురుష్ సినిమా 3.16 మిలియన్ డాలర్స్ ని రాబట్టగా… సాహో సినిమా 3.23 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది.  మరో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యే లోపు హనుమాన్ మూవీ ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్.