
నిన్నటి నుండి ఇండియన్ సినీ థియేటర్స్ అన్ని జై హనుమాన్(Jai HanuMan) నినాదాలతో ఊగిపోతున్నాయి. ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. ప్రశాంత్ వర్మ టేకింగ్ కి, తేజ సజ్జ యాక్టింగ్ కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మొదటి షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాను చూడటానికి ఎగబడుతున్నారు ఆడియన్స్.
దీంతో మొదటిరోజు అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఫస్ట్ డే రూ.12 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందట. నిజానికి ఈ సినిమా వచ్చిన టాక్ కి ఇది చాలా తక్కువ. దానికి కారణం సరైనన్ని థియేటర్స్ దొరకకపోవడం, టికెట్లు రేట్లు పెంచకపోవడం. ఈ రెండు కారణాల వల్ల సినిమా కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ప్రస్తుతం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. రానున్న రోజుల్లో హనుమాన్ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ సినిమాకు నార్త్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ కూడా ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ తో ఆ రేంజ్ గ్రాఫిక్స్ ఎలా చేశారో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నార్త్ లో కూడా ఈ మూవీ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు.