"హనుమాన్" వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

"హనుమాన్" వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హనుమాన్'.  తేజ సజ్జ హీరోగా వస్తున్న ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. 'జాంబీ రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇది ఫస్ట్ పాన్ -ఇండియన్ సూపర్ హీరో మూవీ కావడంతో మరో వీశేషం. ఇప్పటివరకు ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ అండ్ టీజర్స్ కి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ సినిమాపై హైప్ రోజురోజుకీ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటోంది.

ఇక ఈ సినిమాని మే 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మెకాట్స్. అయితే.. విడుదల సమయం దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ మాత్రం చేయలేదు.  దీంతో..  తాజాగా ఈ సినిమా రిలీజ్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. 'హను-మాన్' సినిమా విడుదలను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బెస్ట్ ఔట్ పుట్ అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ఈమేరకు నోట్ కూడా రిలీజ్ చేశారు.. ''హనుమాన్ టీజర్ పట్ల మీరు చూపించిన అమితమైన ప్రేమ మా హృదయాలను హత్తుకుంది. అలానే బెస్ట్ అవుట్ కమ్ అందించే బాధ్యతను రెట్టింపు చేసింది. అందరికీ నచ్చే ఒక మంచి చిత్రాన్ని అందిస్తామని మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము. లార్డ్ హనుమంతునికి పరిపూర్ణమైన గీతంగా, అందరూ సెలెబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా నిలుస్తుంది. హను-మాన్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూపించడానికి మేము కూడా ఎదురుచూస్తున్నాం. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తాం. జై శ్రీరామ్'' అని మేకర్స్ నోట్ లో పేర్కొన్నారు. ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.