తెలంగాణ చరిత్రలో ఇదే అతిపెద్ద FDI

తెలంగాణ చరిత్రలో ఇదే అతిపెద్ద FDI

హైదరాబాద్ : రాష్ట్రంలో 20 వేల 761 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ అంగీకరించింది. ఈ మేరకు ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో తన ఏసియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది AWS. ఇందులో భాగంగా హైదరాబాద్ లో మూడు అవెలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో అవెలబిలిటి జోన్లో మల్టీపుల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్న AWS….2022 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది.

తెలంగాణ చరిత్రలో ఇదే అతిపెద్ద FDI అన్నారు కేటీఆర్. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన కారణంగానే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తన దావోస్ పర్యటనలో భాగంగా AWS సంస్థ ప్రతినిధులను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. AWS పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఆమెజాన్ కు ఇప్పటికే అతిపెద్ద కార్యాలయం ఉందన్నారు కేటీఆర్. తాజా పెట్టుబడులతో ఆ బంధం మరింత బలపడుతుందన్నారు.