ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంది: రామ్ చరణ్

ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంది: రామ్ చరణ్

అయోధ్య(Ayodhya) రామమందిర(Ram Mandhir) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దాదాపు 500 ఏళ్లుగా కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న తరుణం మరికొన్ని గంటల్లోనే నెరవేరనుంది. ఈ మహత్తర కార్యాన్ని కనులారా వీక్షించేందుకు యావత్‌ భారతావణితో.. సినీ, రాజకీయ ప్రముఖులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi), భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan) ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు.

అయోధ్య చేరుకున్న రామ్‌చరణ్‌ (Ram Charan) నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరం కోసం కోట్లాది మందిలాగే నేను కూడా ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కారక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది.. అని తెలిపారు రామ్ చ‌ర‌ణ్. మరోవైపు చిరంజీవి మాట్లాడుతూ.. ఇది చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఇంతటి మహత్తర కార్యక్రమంలో భాగం కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. నేను ఆంజనేయ స్వామీ భక్తుడిని. ఆయనే స్వయంగా నాకు ఈ ఆహ్వానం అందించినట్లుగా అనిపిస్తోంది.. అంటూ చెప్పుకొచ్చారు చిరు.