పతంగ్కు పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి

పతంగ్కు పాజిటివ్ టాక్ రావడం హ్యాపీ: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి

‘పతంగ్‌‌‌‌‌‌‌‌’  చిత్రానికి వస్తోన్న రెస్పాన్స్ పట్ల చాలా ఆనందంగా ఉందని దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి అన్నాడు.  ప్రీతి ప‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డాల‌‌‌‌‌‌‌‌, ప్రణ‌‌‌‌‌‌‌‌వ్ కౌశిక్‌‌‌‌‌‌‌‌, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు.  డి.సురేష్ బాబు సమర్పణలో  విజ‌‌‌‌‌‌‌‌య్ శేఖ‌‌‌‌‌‌‌‌ర్ అన్నే, సంప‌‌‌‌‌‌‌‌త్ మ‌‌‌‌‌‌‌‌క, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి  నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ ‘ పతంగుల పోటీ నేపథ్యంలో వచ్చిన మొదటి చిత్రమిది.  ఓ సంక్రాంతి రోజు ఈ ఆలోచన తట్టింది.

ఫారిన్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసుకొచ్చిన రగ్బీ లాంటి గేమ్స్‌‌‌‌‌‌‌‌తో సినిమాలు తీశారు కానీ  మన నేటివిటీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌తో ఎందుకు తీయకూడదు అని మొదలుపెట్టా. అయితే  సీజీ వర్క్‌‌‌‌‌‌‌‌ చేసేటప్పుడు ఎందుకు తీయలేదో అర్థమైంది. ఎటువంటి రిఫరెన్స్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో సీజీకి చాలా సమయం తీసుకున్నాం. కొత్త వాళ్లతో తీయడం సినిమాకు ఫ్రెష్ ఫీల్‌‌‌‌‌‌‌‌నిచ్చింది.  ఫస్ట్ డే నుంచే హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌‌‌‌‌‌‌‌కు  స్టేడియంలో రియల్‌‌‌‌‌‌‌‌గా మ్యాచ్ చూస్తున్న ఫీల్ వచ్చింది అని ఆడియెన్స్ చెప్పడం ఫుల్ హ్యాపీ. ఇండస్ట్రీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చాయి.  జనవరి 1న ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేయబోతున్నాం’ అని చెప్పాడు.