2027 ODI World Cup: కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడలేరు.. కారణమిదే: హర్భజన్ హాట్ కామెంట్స్

2027 ODI World Cup: కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడలేరు.. కారణమిదే: హర్భజన్ హాట్ కామెంట్స్

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఇద్దరూ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పగా.. ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు తెలిపి షాక్ కు గురి చేశారు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండానే భారత్ టీ20, టెస్ట్ క్రికెట్ ఆడనుంది. అయితే వన్డే క్రికెట్ లో మాత్రం మరో రెండేళ్లు కొనసాగనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. 

సౌతాఫ్రికా వేదికగా 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రోకో జోడీ హింట్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్ కు కూడా ఈ విషయం ఊరట కలిగించేదే. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడటం కష్టమని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

"నిజానికి 2027 వన్డే వరల్డ్ కప్ చాలా దూరంలో ఉంది. రోహిత్, కోహ్లీ వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. వారు ఇతర ఫార్మాట్లలో ఆడటం లేదు. మీకు ఎంత నిబద్ధత ఉన్నా.. మీరు ఎంత గొప్పవారైనా ఒక ఫార్మాట్ ఆడి రెండేళ్లు వన్డే క్రికెట్ కొనసాగించడం చాలా కష్టం అవుతుంది. మీరు కంటిన్యూగా క్రికెట్ ఆడకపోతే ఆట ముందుకు కదులుతుంది. కానీ మీరు వెనుకబడిపోతారు". అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు.

ALSO READ : Cricket Mania: ఒకే టైమ్‌కు 2.. ఒకే రోజు 5

ఈ సందర్భంగా ధోనీని ఉదాహరణంగా చూపించాడు. " ఐపీఎల్‌లో ఎంఎస్ ధోని ఆటను చూడండి. గత మూడు సీజన్ లలో అతని ప్రదర్శన చూస్తే అతని నిలకడ లోపంచింది. ఆరు సంవత్సరాల క్రితం ఇండియా తరపున ఆడేటప్పుడు నిలకడగా ఆడిన ధోనీకి.. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్ లో ధోనీకి మధ్య తేడా మీకు కనిపిస్తుంది" అని హర్భజన్ అన్నారు. 

కొన్ని నెలల క్రితం భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం  2027 వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఉండరని తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇండియా టుడేతో మాట్లాడుతూ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, మరో రేండేళ్లు వారు క్రికెట్ లో కొనసాగడం అవకాశం లేదని తెలిపారు.