Cricket Mania: ఒకే టైమ్‌కు 2.. ఒకే రోజు 5: క్రికెట్ ప్రేమికులకు పండగే.. నేడు 5 బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లు

Cricket Mania: ఒకే టైమ్‌కు 2.. ఒకే రోజు 5: క్రికెట్ ప్రేమికులకు పండగే.. నేడు 5 బ్లాక్ బస్టర్ మ్యాచ్‌లు

క్రికెట్ ప్రేమికులకు నేడు ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మంగళవారం (జూలై 22) ఏకంగా 5 మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. వీటిలో నాలుగు అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు.. ఒకటి వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ జరగనుంది. ముందుగా ట్రై సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా, న్యూజీలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ట్రై సిరీస్ లో ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరుకోగా.. షెడ్యూల్ లో భాగంగా నేడు లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఫ్యాన్ కోడ్ యాప్ లో ఈ మ్యాచ్ ను లైవ్ చూడొచ్చు.

సాయంత్రం 5:30 గంటలకు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. వీటిలో ఒకటి మహిళల వన్డే మ్యాచ్. టీమిండియా మహిళలతో ఇంగ్లాండ్ మహిళల జట్టు మూడు వన్డేలో తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్ లో రెండు వన్డేలు జరిగితే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్ లో గెలిచినా జట్టు సిరీస్ గెలుస్తుంది. ఇప్పటికే టీ20 సిరీస్ అందుకున్న హర్మన్‌‌ సేన ఇప్పుడు ఇంగ్లిష్ గడ్డపై వన్డే సిరీస్‌‌ను సొంతం చేసుకొని అరుదైన రికార్డు సృష్టించేందుకు ఆరాటపడుతోంది. మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఫ్యాన్‌కోడ్ లో లైవ్ చూడొచ్చు.   

ALSO READ : IND vs ENG 2025: జురెల్‌కు లక్కీ ఛాన్స్.. నాలుగో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 నేడు 5:30 గంటలకు జరగనుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 లో పాకిస్థాన్ ను చిత్తు చేసి బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూ ఆర్ డై గా మారింది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 ఉదయం 5:30 గంటలకు జరగనుంది. వెస్టిండీస్ లో జూలై 22 న ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ జూలై 23 ఉదయం 5:30 గంటలకు జరగనుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా తొలి టీ20 లో గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. 

వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో భాగంగా నేడు సౌతాఫ్రికా ఛాంపియన్స్ పై టీమిండియా ఛాంపియన్స్ మ్యాచ్ ఆడనున్నారు. సాయంత్రం 9:00 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ఆడకుండా రద్దు చేసుకున్న టీమిండియా నేడు సౌతాఫ్రికాపై బరిలోకి దిగడంతో ఆసక్తి నెలకొంది. మొత్తానికి 24 గంటల వ్యవధిలో 5 బ్లాక్ బస్టర్ మ్యాచ్ లు చూసి ఎంజాయ్ చేయడానికి క్రికెట్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు.