
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రపంచ క్రికెట్ లో సంచలనంగా మారింది. వరల్డ్ క్రికెట్ లో టాప్ ఫిట్ నెస్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. పరుగులు చేయాలనే తపన ఇంకా ఉన్నప్పటికీ అనూహ్యంగా టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి భారత క్రికెట్ తో పాటు ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. 36 ఏళ్ళ కోహ్లీకి మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. కోహ్లీ రిటైర్మెంట్ పై షాకైన వారిలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు.
కోహ్లీ నిర్ణయం హర్భజన్ ను మాత్రమే కాదు అతని కుమార్తె హినయను కూడా షాక్కు గురిచేసిందని హర్భజన్ తెలిపాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించగానే హర్భజన్ కూతరు తన తరపున కోహ్లీకి మెసెజ్ పంపమని ప్రత్యేకంగా కోరిందని.. ఆ మెసేజ్ కు కూడా కోహ్లీ నుంచి ఎమోషనల్ రిప్లై వచ్చిందని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. హర్భజన్ మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. నా కూతురు నాతో, 'నాన్న, విరాట్ కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నాడు? నేను అతనికి మెసేజ్ పంపాలనుకుంటున్నాను' అని అడిగింది.
Also Read : కోట్ల మందిలో అవమానించి క్రీడా స్ఫూర్తి అంటే ఎలా
నా కూతురు విరాట్ కోహ్లీకి "నేను హినాయని. నువ్వు ఎందుకు రిటైర్మెంట్ తీసుకున్నావు?' అని రాసింది. ఆమె మనసు కూడా తట్టుకోలేకపోయింది. దానికి కోహ్లీ ఎమోషనల్ రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ నవ్వుతూ " బేటా.. నా టైం అయిపోయింది" అని సమాధానమిచ్చాడు. అని హర్భజన్ షేర్ చేశాడు. కోహ్లీ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. ‘టెస్ట్ క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ (ఇండియా క్యాప్) పెట్టుకొని14 ఏండ్లు గడిచాయి.