IPL 2025: కోట్ల మందిలో అవమానించి క్రీడా స్ఫూర్తి అంటే ఎలా.. : పంత్‌పై అశ్విన్ ఫైర్

IPL 2025: కోట్ల మందిలో అవమానించి క్రీడా స్ఫూర్తి అంటే ఎలా.. : పంత్‌పై అశ్విన్ ఫైర్

ఐపీఎల్ 2025 లో లక్నో సూపర్ జయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాత్ చేసిన రనౌట్ సంచలనంగా మారింది. నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న జితేష్ శర్మను రనౌట్ చేసి చాలా మ్యాచ్ ల తర్వాత మన్కడింగ్ గుర్తు చేశాడు.  మంగళవారం (మే 27) రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాత్ చేసిన మన్కడింగ్ విమర్శలకు గురవుతుంది. ఇన్నింగ్స్ 17 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తమ అప్పీల్ ను వెనక్కి తీసుకోవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దిగ్వేశ్ పై ఓ వైపు విమర్శలు వస్తుంటే భారత వెటరన్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. 

అశ్విన్ మాట్లాడుతూ.. " ఆటగాడికి మద్దతు ఇవ్వడం కెప్టెన్ చేయాల్సిన పని. పంత్ మాత్రం తన బౌలర్ ను తక్కువ చేసాడు. అప్పీల్‌ను ఉపసంహరించుకునే ముందుగా దిగ్వేశ్ తో ఒకసారి చర్చిస్తే బాగుండేది. వారు చర్చించుకున్నారో లేదో మాకు తెలియదు. కానీ కోట్లాది మంది ప్రజల ముందు ఆ దిగ్వేశ్ ను అవమాననానికి గురి చేశాడు. దిగ్వేష్ రతి నా బంధువు కాదు, నా స్నేహితుడు కాదు. అతను ఎవరో నాకు తెలియదు. మరోసారి దిగ్వేశ్ ఇలా చేయడానికి సందేహిస్తాడు. ఒక బౌలర్ అలా చేయడం తప్పు కాదు. రూల్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా తప్పు కాదు. అతడిని మనం ఏం అనకూడదు". అని అశ్విన్ తెలిపాడు. 

ALSO READ | PBKS vs RCB: అతడిపై వేటు తప్పదా: క్వాలిఫయర్1 లో RCB ప్రయోగాలు.. తుది జట్టులో తుషార, హేజల్ వుడ్

దిగ్వేశ్ నాన్ స్ట్రైకింగ్ లో రనౌట్ చేసే సమయంలో జితేష్ క్రీజ్ దాటిన మాట నిజమే. దీంతో పంత్ అప్పీల్ వెనక్కి తీసుకోకపోతే జితేష్ ఔటయ్యేవాడని అందరూ భావించారు. పంత్ పై క్రీడా స్ఫూర్తిపై ప్రశంసలు కురిపించి జితేష్ బతికిపోయాడని అందరూ అనుకున్నారు. అయితే MCC లా 38.3.1 ప్రకారం ఒక ఆటగాడు పాపింగ్ క్రీజ్ అనగా అంపైర్ కు ముందు ఉన్న క్రీజ్ దాటి తన బౌలింగ్ యాక్షన్ ఆపేస్తే నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న బ్యాటర్ ను రనౌట్ చేయడానికి సాధ్యం కాదని రూల్స్ చెబుతున్నాయి.

దిగ్వేశ్ పాపింగ్ తన బౌలింగ్ యాక్షన్ తో క్రీజ్ దాటి వెళ్ళాడు. ఆ తర్వాత తన బౌలింగ్ యాక్షన్ ను సడన్ గా ఆపేసి నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న జితేష్ ను రనౌట్ చేసి అప్పీల్ చేశాడు. దిగ్వేశ్ పాపింగ్ క్రీజ్ దాటే సమయానికి జితేష్ బ్యాట్ క్రీజ్ లోనే ఉంచాడు. ఆ తర్వాత దిగ్వేశ్ బౌలింగ్ యాక్షన్ చూసి క్రీజ్ దాటాడు.