Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాండ్య ఫిట్

Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాండ్య ఫిట్

సౌతాఫ్రికాతో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు. ఆసియా కప్ లో గాయపడిన పాండ్య ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. ఫిట్ నెస్ టెస్టులో పాస్ అయిన పాండ్య ప్రాక్టీస్ కోసం ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడడానికి సిద్ధమయ్యాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు ముందు పాండ్యకు ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. డిసెంబర్ 9 నుంచి సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బరోడా తరపున పాండ్య డిసెంబర్ 2, డిసెంబర్ 4 తేదీలలో వరుసగా పంజాబ్, గుజరాత్‌తో మ్యాచ్ లు ఆడనున్నాడు. 

ఆసియా కప్ లో గాయం:  

ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఆసీస్ సిరీస్ తో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఈ టీమిండియా ఆల్ రౌండర్ పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తోంది. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య త్వరలోనే భారత జట్టులోకి రానున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడించి టీ20 వరల్డ్ కప్ ముందు రిస్క్ చేయాలనుకోలేదు. దీంతో హార్దిక పాండ్య సౌతాఫ్రికాతో జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అందుబాటులో ఉంటాడు.

డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్: 

వన్డే సిరీస్ తర్వాత భారత జట్టు టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. డిసెంబర్ 9న కటక్ వేదికగా తొలి టీ20.. డిసెంబర్ 11 న్యూ చండీగఢ్ వేదికగా రెండో టీ20.. డిసెంబర్ 14న ధర్మశాల వేదికగా మూడో టీ20.. డిసెంబర్ 17న లక్నో వేదికగా నాలుగో టీ20.. డిసెంబర్ 19న అహ్మదాబాద్ లో ఐదో టీ20 జరుగుతాయి. టీ20 మ్యాచ్ లు రాత్రి 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. మంగళవారం (డిసెంబర్ 2) భారత టీ20 జట్టును ప్రకటించే అవకాశం ఉంది. సూర్య కుమార్ యాదవ్ భారత టీ20 జట్టును లీడ్ చేయనున్నాడు.