MS Dhoni, Hardik pandya : షోలే 2.0లో ధోనీ, పాండ్యా!

MS Dhoni, Hardik pandya : షోలే 2.0లో ధోనీ, పాండ్యా!

న్యూజిలాండ్ తో జరిగే మొదటి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా బుధవారం రాంచీ చేరుకుంది. భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ సొంతూరు రాంచీ కావడంతో ఆయనను కలిసేందుకు హార్దిక్ పాండ్యా తన అభిమాన ఆటగాడిని కలిసేందుకు వెళ్లాడు. ధోనీ గ్యారేజీలో కాసేపు సరదాగా గడిపిన పాండ్యా.. ధోనీని బైక్ సైడ్ కారులో ఎక్కించుకొని దిగిన ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘త్వరలో షోలే 2 మీ ముందుకు రాబోతోంది. సిద్ధంగా ఉండండి’ అంటూ ట్యాగ్ లైన్ రాశాడు. 

ఆ ఫొటోను చూసి ‘యే దోస్తీ హమ్ నహీం తోడేంగే’అని, ‘మరో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు, బయట కూడా ధోనీ, హార్దిక్ ల స్నేహం ఎలాంటిదో అందరికీ తెలుసు. హార్దిక్.. ధోనీని సొంత అన్నలా భావిస్తాడు. ఆ విషయాన్ని హార్దిక్ పాండ్యా చాలాసార్లు చెప్పాడు.