ఎమోషనల్ సీన్స్ విషయంలో రాజమౌళి మాకు స్ఫూర్తి : హరి, హరీష్

ఎమోషనల్ సీన్స్ విషయంలో రాజమౌళి మాకు స్ఫూర్తి : హరి, హరీష్

సమంత హీరోయిన్‌‌గా హరి, హరీష్ రూపొందించిన లేడీ ఓరియెంటెడ్  మూవీ ‘యశోద’. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈనెల 11న  తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.  ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి దర్శకులిద్దరూ  ఇలా ముచ్చటించారు.  తమిళంలో ఒరు ఇరవు, అంబులి, జంబులింగం లాంటి చిన్న చిత్రాలు తీశాం. బడ్జెట్ పరంగా వాటికి ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంది. కథ పరంగా ఎప్పుడూ ఓ కొత్త పాయింట్ చెప్పాలనేది మా ఉద్దేశం.  ఈ మూవీని లిమిటెడ్ బడ్జెట్‌‌లో తీసేందుకు ఒక వెర్షన్ రెడీ చేశాం.  కథ రాసేటప్పుడు మాత్రం యశోద పాత్రలో సమంత గారినే ఊహించుకున్నాం. ఈ ప్రాజెక్ట్‌‌లోకి శివలెంక కృష్ణప్రసాద్ గారు వచ్చాక ‘కంటెంట్ బావుంది. గ్లోబల్ రీచ్ ఉంటుంది. ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా చేద్దాం’ అన్నారు. కథ చెప్పగానే సమంత గారు ఓకే చేశారు. 

ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్‌‌ ప్రేక్షకులకు కూడా నచ్చేలా కొత్త కంటెంట్‌‌తో తీశాం. సరోగసీ అనేది మెయిన్ స్టోరీ కాదు. కథలో అదొక భాగమంతే. న్యూస్‌‌లో చూసిన, చదివిన విషయాల ఆధారంగా ఈ స్క్రిప్ట్ రాశాం. ఇద్దరం కలిసే కొవిడ్‌‌ టైమ్‌‌లో స్క్రిప్ట్ డెవెలప్ చేశాం. ఆ తర్వాత సస్పెన్స్ ఎలిమెంట్స్‌‌ యాడ్ చేశాం. దాంతో స్క్రీన్‌‌ ప్లే మరింత ఇంటరెస్టింగ్‌‌గా మారింది.  ఎంత పెద్ద ఎమోషనల్ సీన్ అయినా సరే రెండు నిమిషాల టైమ్ అడుగుతారు సమంత. సెట్ అంతా సైలెన్స్‌  అయ్యాక గ్లిజరిన్ కూడా వాడకుండా చాలా ఈజీగా ఆ సీన్ చేసేస్తారు. ఆమె క్యారెక్టర్‌‌‌‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. చాలా బాగా చేశారు. మేం స్క్రిప్ట్ రాసినప్పుడే యాక్షన్ సీన్స్‌‌ కూడా రాశాం. 

సమంత గారు చేయడంతో అవి ఎక్కువ ఎలివేట్ అయ్యాయి. పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌‌లో ఆమె హెల్త్ కండిషన్‌‌ గురించి మాకు తెలిసింది. సినిమాలో ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మూవ్‌ ఉంటుంది. సర్‌‌ప్రైజ్‌‌లు షాక్ ఇస్తాయి. మహిళలు, మాతృత్వం, మెడికల్ మాఫియా లాంటి అంశాలను ఇందులో చెప్పాం. మొత్తంగా చూస్తే ఎమోషన్‌‌తో కూడిన థ్రిల్లర్‌‌‌‌గా ఈ సినిమాను చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ విషయంలో రాజమౌళి గారు మాకు స్ఫూర్తి.