Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'కు కౌంట్‌డౌన్.. యూఎస్ ప్రీ-సేల్స్ కలవరం!

Pawan Kalyan : 'హరి హర వీరమల్లు'కు కౌంట్‌డౌన్..  యూఎస్ ప్రీ-సేల్స్ కలవరం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) , నిధి అగర్వాల్ ( Nidhhi Agerwal )ప్రధాన పాత్రలో వస్తున్న ' హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu ) కు కౌంట్ డౌన్ మొదలైంది.  భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా చిత్రం విడుదలకు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. జూలై 24న  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ మూవీ వస్తుండటంతో అభిమానులు ఎంతో ఆశ్రుతగా ఎదురుచూస్తున్నాయి.  దీనిపై సినీ ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఇప్పటికే  యూఎస్‌లో 'హరి హర వీరమల్లు' ప్రీమియర్ షోలకు సంబంధించి  అడ్వాన్స్ బుకింగ్‌ప్రారంభమైంది.  నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షోల కోసం సుమారు 217,839 యూఎస్‌డి (దాదాపు 1.87 కోట్ల రూపాయలు) మాత్రమే ప్రీ-సేల్స్ ద్వారా వసూలు చేసింది. యూఎస్‌లోని దాదాపు 422 లొకేషన్లలోని 1115 షోల నుండి సేకరించబడింది. నివేదికల ప్రకారం, జూలై 18, శుక్రవారం ఉదయం నాటికి ఈ చిత్రం సుమారు 7,916 టిక్కెట్లను మాత్రమే విక్రయించింది. 

సాధారణంగా, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు యూఎస్‌లో ప్రీమియర్ షోల ద్వారా మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు నమోదవుతాయి. 'అజ్ఞాతవాసి' వంటి డిజాస్టర్ చిత్రానికి కూడా భారీ ప్రీ-సేల్స్ నమోదయ్యాయి.  నిరాశాజనకమైన అడ్వాన్స్ బుకింగ్‌లను నమోదు కావడం పవన్ అభిమానులతో పాటు ట్రేడ్ పండితుల్లోనూ కొంత ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ గణాంకాలు సినిమాపై ప్రేక్షకుల్లో హైప్, అవగాహన లోపించినట్లు స్పష్టంగా సూచిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   అయితే మరో ఐదు రోజులు ఉన్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. 

ALSO READ : హరిహర వీరమల్లు టికెట్ రేట్ల పెంపు : రూ.600 ప్లస్ GST

మరో వైపు 'హరి హర వీరమల్లు' దేశీయ బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు.  పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌ను బట్టి చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల రేటు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.   ప్రీ-సేల్స్‌లో సినిమా తొందరగా దూసుకుపోతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.  ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించగా.. నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సత్యరాజ్, బాబీ డియోల్‌వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ తారాగణం తో తెరకెక్కుతున్న ఈ మూవీని  క్రిష్ జాగర్లమూడి,, ఎ.ఎమ్. జ్యోతి కృష్ణ  దర్శకత్వంలో ఎఎం రత్నం నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను అందుకుని, బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.