
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu )ఒకటి. క్రిష్ జాగర్లమూడి (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది.
ALSO READ :OG గ్లింప్స్ వచ్చేసింది.. సాలా సైతాన్.. పూనకాలు తెప్పించిన సుజీత్
ఇక తాజాగా సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Birthday Treat) పుట్టినరోజు సందర్భంగా హరి హర వీరమల్లు మూవీ నుంచి సరికొత్త బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో పవన్ గడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. పవన్ కల్యాణ్ బంధిపోటుగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.