
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న గ్యాంగ్ స్టార్ OG. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలి తమిళ నటుడు అర్జున్ దాస్, నటి శ్రియా రెడ్డి, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా OG సినిమా నుండి హంగ్రీ చీతా పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ముందు నుండి ఇస్తున్న హైప్ కి తగ్గట్టే టీజర్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. 99 సెకండ్స్ ఉన్న ఈ ఈ గ్లింప్స్ లో పవన్ ప్రెజెంటేషన్, అర్జున్ దాస్ వాయిస్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.
Also Read : ఊరమాస్ లుక్‌లో పవర్ స్టార్.. హరిహర వీరమల్లు నుండి సర్‌ప్రైజ్
పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా అనే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ మొదలైంది. అది మట్టీ చెట్లతో పాటు సగం ఊరినే ఊడ్చేసింది. కానీ.. వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటిదాకా ఏ తుఫాను కడగలేకపోయింది. it was freaking blood bath.. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే.. సాలా షైతాన్.. అంటూ పవర్ ఫుల్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు సుజీత్. ఇక గ్లింప్స్ కు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయేలా ఉంది. పోవాన్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.