Ban Adipurush : ఢిల్లీ, హరిద్వార్ ధియేటర్లలో ఆందోళనలు

Ban Adipurush  : ఢిల్లీ, హరిద్వార్ ధియేటర్లలో ఆందోళనలు

బ్యాన్ ఆదిపురుష్.. ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయండి.. సినిమా ధియేటర్లలో ఆదిపురుష్ ను ప్రదర్శించొద్దు.. ఇదీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఇప్పటికే ఆల్ ఇండియా సినిమా వర్కర్లు.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనికి కొనసాగింపుగా అన్నట్లు.. హరిద్వార్, ఢిల్లీలోని మల్టీఫ్లెక్స్ ధియేటర్లలో భజరంగ్ దళ్, ఇతర హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. సినిమా చూస్తున్న సమయంలోనే.. మధ్యలో లేచి గొడవ చేశారు. ఆదిపురుష్ సినిమాను నిలిపి వేయటమే కాకుండా.. ఎక్కడా ప్రదర్శించకుండా.. వెంటనే సినిమాపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నాయి ఆయా సంఘాలు.

ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడు నీ యబ్బా లాంటి పదాలు మాట్లాడటం.. వాల్మీకి రామాయణానికి.. ఆదిపురుష్ సినిమాకు పొంతన లేకపోవటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సినీ అభిమానులే కాకుండా హిందూ సంఘాలు. రాముడి చరిత్రను వక్రీకరించారని.. మొబైల్ గేమింగ్ తరహాలో అసహాస్యం చేశారని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెగేసి చెబుతూ.. హరిద్వార్, ఢిల్లీలో ఆందోళనలకు దిగారు భజరంగ్ దళ్ కార్యకర్తలు.

హరిద్వార్ కు చెందిన మహా మండలేశ్వర స్వామి ప్రబోదానంద్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా అనేది సనాతన సంస్కృతిని కించపరిచే విధంగా ఉందని.. ఇది అంతర్జాతీయ కుట్రగా అభిప్రాయపడ్డారు. సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ అసహ్యంగా.. అసభ్యకరంగా ఉన్నాయని.. ఈ సినిమాను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారాయన. 

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FUnitedHinduFrnt%2Fstatus%2F1670765112175759360&widget=Tweet

హరిద్వార్ లోని మరో పీఠాధిపతి సంతోషానంద్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమాలోని పాత్రలు, వాటిని మలిచిన తీరు సనాతన ధర్మం, సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని.. పాత్రల ఔన్నిత్యాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని.. సినిమాను ప్రదర్శించకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారాయన. 

ఇక ఢిల్లీలో అయితే ఐక్య హిందూ ఫ్రంట్ కార్యకర్తలు.. వికాస్ సినీ మాల్ లో ఆదిపురుష్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఆదిపురుష్ నిర్మాత, దర్శకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ధియేటర్ లోని ప్రేక్షకులను బలవంతంగా బయటకు పంపించారు. 

500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాలో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే కాకుండా.. అసలు రామాయణాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేశారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అన్ని హిందూ సంఘాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఆదిపురుష్ సినిమా బ్యాన్ చేయాలనే వాయిస్ రైజ్ చేయటం విశేషం. ఇదే క్రమంలోనే.. ఆల్ ఇండియా సినీ వర్కర్ల యూనియన్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాయటం చూస్తుంటే.. ఆదిపురుష్ సినిమా బ్యాన్ అనేది అతి త్వరలోనే ఉండొచ్చని సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.