
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌తో ఈ విషయం మరోసారి రుజువైంది. ట్రైలర్ విడుదలైన నిమిషం నుంచే దీనికి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, తెలుగు సినిమాల పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అన్ని భాషల్లో కలిపి దాదాపు 62 మిలియన్ల వ్యూస్ సాధించింది.
పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని చారిత్రక యోధుడు పాత్రలో కనిపించడం అందరినీ ఆకర్షించింది. మరోవైపు ఈ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. తన వాయిస్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచిందన్నారు. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ పూర్తి చేశాడు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. జులై 24న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.