హరీశ్ హుజురాబాద్ పోరాటంలో బిజీగా ఉన్నారు 

హరీశ్ హుజురాబాద్ పోరాటంలో బిజీగా ఉన్నారు 

హైదరాబాద్: హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. సోమవారం టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్.. కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, గంగుల కమలాకర్ లాంటి  చాలామంది సీనియర్ నేతలు సభకు రాలేదన్నారు. వారు హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరాటంలో ఉన్నారని తెలిపారు. ఆ లీడర్లంతా మన మధ్యనలేకపోయినా టీవీలో లైవ్ చూస్తున్నారని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలకు నవంబర్ 4 తర్వాత అన్ని ఫథకాలు అందుతాయన్న సీఎం.. గెల్లు శ్రీనివాస్ గెలిచిన వెంటనే దళితబంధు అందజేస్తారని తెలిపారు. హుజూరాబాద్ లో 100 శాతం దళితబంధు అమలవుతుందని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ ను గెలిపించి అడ్డదిడ్డంగా మాట్లాడే వారికి సమాధానం చెప్పుదామని తెలిపారు సీఎం కేసీఆర్. 

హుజూరాబాద్ ఉప ఎన్నికను పోరాటంతో పోల్చిన సీఎం

అయితే ..ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక తమకు ఎంతో తేలికని కేటీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ.. ఈ ఎన్నికను చాలా సీరియస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హరీష్ తో పాటు పలవురు నేతలు హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నిక తేలిక అంటూనే.. కేసీఆర్ కూడా ఎన్నికను ఎంతో సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పకనే చెప్పారు.