నైనీ అవినీతి సూత్రధారి రేవంత్.. మొదటి లబ్ధిదారు ఆయన బామ్మర్ది: హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు

నైనీ అవినీతి సూత్రధారి రేవంత్.. మొదటి లబ్ధిదారు ఆయన బామ్మర్ది: హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు
  •     ఓబీ రిమూవల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సైట్ విజిట్ నిబంధన తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం
  •     ఈ సర్కారు వచ్చాకే బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: సింగరేణి నైనీ కోల్ టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డే అసలు సూత్రధారి, పాత్రధారి అని, ఆయన బామ్మర్ది మొదటి లబ్ధిదారుడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. బొగ్గు కుంభకోణంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేశారని అన్నారు. 

సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని, ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానిదో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదని పేర్కొన్నారు. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని చెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మీడియాతో మాట్లాడారు.  40 ఏండ్ల రాజకీయ అనుభవాన్ని వాడి  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి చెప్పారని, కానీ, ఎలాంటి పనులకు ఆ నిబంధన పెట్టారనేది మాత్రం చెప్పలేదని విమర్శించారు.  

‘‘సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐ) సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రతిపాదించిందని చెబుతున్నారు. కానీ, ఆ సిఫార్సు అసలు ఎలాంటి పనుల కోసం? అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా? కోల్ ఎవాక్యుయేషన్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసమా? స్క్రీనింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోసమా? లేదా నిజంగానే  ఓవర్ బర్డెన్ (ఓబీ) రిమూవల్ పనుల కోసమా? ఇది పరిమిత ప్రాంతాల్లో జరిగే డిజైన్, సరఫరా, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిషనింగ్ పనులకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధన. సైనిక్ స్కూల్ వాళ్లు ఒక టెండర్ పిలిచారు. 

ఇందులో సప్లై అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్  కోసం సైట్ విజిట్ పెట్టారు. దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదం. భట్టి చూపించిన డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కడైనా ఓబీ రిమూవల్ కోసం సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఎక్కడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు” అని వివరించారు.

అంచనా కంటే ఎక్కువ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఓబీ రిమూవల్ విషయంలో సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికెట్ విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని హరీశ్ రావు ఆరోపించారు. 2025 జనవరిలో భూపాలపల్లి టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సైట్ విజిట్ షరతు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వారా అంచనా రేట్ల కంటే 7% తక్కువకు పనులు అప్పగించారని, అప్పుడు సైట్ విజిట్ అవసరం లేదా? అని ప్రశ్నించారు. కానీ, ఆ తర్వాత 3 నెలల్లోనే 2025 మేలో వీకే ఓసీ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రం సైట్ విజిట్ సర్టిఫికెట్ షరతు పెట్టడంతో పోటీ తగ్గిపోయిందన్నారు. 

ఫలితంగా అంచనా రేట్లకంటే ఎక్కువ రేట్లకు లబ్ధిదారు సుజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి శోధా కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పని దక్కిందన్నారు.  2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా  రింగ్ మాస్టర్ సుజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అని ఆరోపించారు. 

ఇంత స్పష్టంగా తాను బయటపెట్టినా కూడా స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగలేదని భట్టి  బుకాయించడం శోచనీయమన్నారు. ఒక్క నైనీ బ్లాక్ టెండరే కాకుండా.. సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. ఓబీ స్కామ్, సోలార్ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లే కాకుండా.. సింగరేణిలో ఇంకా ఎన్నో కుంభకోణాలున్నాయని ఆరోపించారు. ‘‘ఈ కుంభకోణంలో కింగ్ పిన్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  సీఎం బంధువు  ఆ హోటల్లో కూర్చున్న ఫొటోలు కూడా మా  దగ్గర ఉన్నాయి.  

టైం వచ్చినప్పుడు బయట పెడతాం” అని అన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బొగ్గు ఉత్పత్తి పడిపోయిందని, అమ్మకాలూ తగ్గిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. రెండేండ్లలో సింగరేణి అభివృద్ధి కోసం పక్కన పెట్టిన రూ.6 వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ స్కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా త్వరలో బయటపెడతామని అన్నారు. సింగరేణిని దివాళా తీయించి ప్రైవేటుపరం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.