
బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా శాసన మండలిలో మంత్రి హరీష్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మధ్య వాదోపవాదాలు జరిగాయి.
ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఎలాంటి విఙ్ఞప్తులు రాలేదంటూ రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. అసలు కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో కేంద్రం చెబుతోంది తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది తప్పా.. అని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి కామెంట్స్ పై మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపమంతా కాంగ్రెస్‌దేనని అన్నారు హరీష్ రావు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదాను ఎందుకు విస్మరించారని జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రిని కలిసి అన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారని.. అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందని తెలిపారు హరీష్ రావు. ఇంత కంటే ఏం సాక్ష్యాలు కావాలని.. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసులు వేసినోళ్ల పేర్లను సభా ముఖంగా తానే వెల్లడించానని హరీశ్ చెప్పారు.
అయితే, ఎవరి తప్పు ఎలా ఉన్నా… రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడుకుండా చూడాలన్న జీవన్‌రెడ్డి..
కాళేశ్వరంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే… ఎవరు తప్పు చెబుతున్నారో తెలుస్తుందని డిమాండ్ చేశారు…