పేరొచ్చే పనులకు కేటీఆర్​..తిట్లొచ్చే వాటికి హరీశ్!

పేరొచ్చే పనులకు కేటీఆర్​..తిట్లొచ్చే వాటికి హరీశ్!
  • పేరొచ్చే పనులకు కేటీఆర్​..తిట్లొచ్చే వాటికి హరీశ్!
  • అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నిట్ల కేటీఆర్ హవా
  • పాలన మారిపోగానే ముందటికి హరీశ్​..!
  • అసెంబ్లీ సెషన్​లో కార్నర్​ అయిన బావ.. ప్రేక్షక పాత్రలో బావమరిది​
  • నెగెటివ్​ విషయాల్లో కావాలనే హరీశ్​ను ముందుకు నెడుతున్నారన్న టాక్​

బీఆర్ఎస్​ పార్టీలో కేసీఆర్ తర్వాతి లీడర్ ఎవరని అడిగితే ఎవరైనా మరో ఆలోచన లేకుండా కేటీఆర్​ అని చెప్పేస్తారు. బీఆర్ఎస్​ హయాంలో సీఎం చైర్​లో కూర్చోలేదు గానీ, అన్ని డిపార్ట్​మెంట్లనూ ఆయనే ఓ సీఎం లెక్క హ్యాండిల్​ చేశారన్న వాదనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు అధికారం పోయే సరికి కేటీఆర్​ను సైలెంట్​ చేసి.. హరీశ్​ను ముందుకు తోశారన్న చర్చ జరుగుతున్నది. పేరొచ్చే పనుల్లో కేటీఆర్​ను, తిట్లొచ్చే వాటికేమో హరీశ్​రావును ముందుకు తెస్తున్నారని బీఆర్​ఎస్​ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీశ్ ఒక్కరే బీఆర్ఎస్​ తరఫున అన్నింటినీ హ్యాండిల్​చేయాల్సి వచ్చింది.  

పేరొచ్చే పనులకు కేటీఆర్​ను, తిట్లొచ్చే వాటికేమో హరీశ్ రావును ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్​ నేతలు చెప్పుకుంటున్నారు. అందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలు, గతంలో ఉప ఎన్నికల సమయంలో అప్పగించిన బాధ్యతలను ఉదహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీశ్ ఒక్కరే బీఆర్​ఎస్​ తరఫున అన్నింటినీ హ్యాండిల్​ చేయాల్సి వచ్చింది. 

పార్టీ ఫ్లోర్​లీడర్​గా ఉన్న కేసీఆర్​ అసెంబ్లీ బడ్జెట్​ సెషన్​ మొత్తానికి డుమ్మా కొట్టారు. కేటీఆర్​ లీడ్​ తీసుకుంటారేమోనని అంతా అనుకున్నా.. సెషన్​ మొత్తంలో అప్పుడప్పుడు తప్ప  ప్రేక్షక పాత్రకే ఆయన పరిమితమయ్యారు. సైలెంట్​గా ఉండిపోయారు. ఫస్ట్​ సెషన్​లో ఫైనాన్స్​, విద్యుత్​ శాఖలపై వైట్​పేపర్లు.. సెకండ్​ సెషన్​లో కీలక బిల్లులు, కులగణన తీర్మానం, కేఆర్​ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న తీర్మానంతో పాటు ఇరిగేషన్ మీద వైట్​పేపర్ రిలీజ్​పైనా బీఆర్​ఎస్​ తరఫున హరీశ్​రావు లీడ్​ తీసుకునే పరిస్థితిని కల్పించారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెగెటివ్​ విషయాల్లో హరీశ్​రావును ముందుకుతోస్తూ కేటీఆర్​ను మాత్రం సేఫ్​జోన్​లో ఉంచేలా కేసీఆర్​ వ్యవహరిస్తున్నట్లు ఉందని వారిలో చర్చ నడుస్తున్నది. 

కార్నర్​ హరీశ్​!

బడ్జెట్​ సెషన్​లో అత్యంత హాట్​ టాపిక్​ అంశం ఏదైనా ఉందంటే అది ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​పై ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైట్​పేపరే. అంతకన్నా ముందే ఎమ్మెల్యేలను మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి ప్రభుత్వం తీసుకెళ్లి అక్కడి పరిస్థితిని వాళ్లకూ తెలిసేలా చేసింది. బీఆర్​ఎస్​, బీజేపీ వాళ్లను పిలిచినా వెళ్లలేదు. ఆ తర్వాత ప్రాజెక్టు సహా రాష్ట్రంలోని ఇరిగేషన్​ వ్యవహారాలపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అధికారంలో ఉన్నన్ని రోజులు కాళేశ్వరాన్ని గొప్పగా చెప్పుకున్న కేసీఆర్.. దీని మీద చర్చించేందుకైనా అసెంబ్లీకి వస్తారని కొందరు బీఆర్​ఎస్​ నేతలు భావించినా ఆయన రాలేదు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు మాత్రం హాజరయ్యారు. 

ALSO READ : కొత్తగూడెం అవిశ్వాసంపై ఉత్కంఠ

ఇటు మొన్నటిదాకా సభకు హాజరైన కేటీఆర్​ కూడా.. ఇరిగేషన్​ మీద వైట్​పేపర్​ ప్రవేశపెడుతున్న రోజునే కేసీఆర్​ బర్త్​ డే ఉత్సవాల పేరిట సభకు రాలేదు. దీంతో అక్కడ హరీశ్​ రావే బీఆర్ఎస్​ తరఫున అన్నీ తానై చూసుకోవాల్సి వచ్చింది. ఇరిగేషన్​ తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీశ్​రావు కార్నర్​ అయ్యారు. ఇట్ల నెగెటివ్​ అంశాల నుంచి కేసీఆర్​, కేటీఆర్​ దూరంగా ఉండడంతో.. అవన్నీ హరీశ్​ రావు మీదికి వచ్చిపడ్డాయని బీఆర్​ఎస్​ వర్గాలు అంటున్నాయి.  

నిర్మాణం వరకు ఉంచుకొని.. ప్రారంభోత్సవానికి దూరం పెట్టి..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పట్లో ఇరిగేషన్​ మంత్రిగా హరీశ్​రావు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. అయితే, తీరా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక.. ప్రారంభోత్సవానికి మాత్రం హరీశ్​రావును కేసీఆర్​ దూరం పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ప్రాజెక్టు ఓపెనింగ్​కు అట్ల చేసి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రాజెక్టుపై జరిగిన చర్చకు మాత్రం హరీశ్​రావును ముందుకు తోశారన్న వ్యాఖ్యలు గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో నిరసన తెలపాలన్న.. పోడియం వద్దకు వెళ్లాలన్నా.. హరీశ్​రావే ముందుకు రావాల్సి వచ్చింది. వాకౌట్​ విషయంలోనూ ఆయన లీడ్​లోనే పార్టీ నేతలు నడిచారు.  

ఓడిపోయే స్థానాలకు హరీశ్​ ఇన్​చార్జ్​!

దుబ్బాక, హుజూరాబాద్​ బైపోల్స్​లో ఆయా నియోజకవర్గాలకు హరీశ్​ రావునే బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఇన్​చార్జ్​గా నియమించారు. ఆయా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే హరీశ్​రావుకు ఆ బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. అయితే, ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో మాత్రం కేటీఆర్​కు ఇన్​చార్జ్​గా బాధ్యతలు అప్పగించారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు కమ్యూనిస్టులతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగిన బీఆర్​ఎస్​.. గెలుస్తామని ముందు నుంచీ ధీమాతోనే ఉన్నది. ఈ నేపథ్యంలోనే అక్కడ కేటీఆర్​కు బాధ్యతలిచ్చారని పలువురు నేతలు అంటున్నారు. అంటే గెలిస్తే క్రెడిట్​ కేటీఆర్​కు.. ఓడితే తిట్లు హరీశ్​ రావుకు అన్నట్టుగా బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నారన్న చర్చ నడుస్తున్నది.