కేసీఆర్ను ఉంచుకుందామా..? చంపుకుందామా..? : హరీష్రావు

కేసీఆర్ను ఉంచుకుందామా..? చంపుకుందామా..? : హరీష్రావు

వ్యవసాయ మోటార్లకు తెలంగాణ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోవడం వల్లే తాము నిధులు ఆపామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే.. బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెట్టమని అంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. 

-కర్ణాటకలో గెలిచిన తర్వాత ఐదు గంటలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఇవ్వడం లేదన్నారు. ఆడబిడ్డలు తయారు చేస్తున్న బీడీ కట్టలపై అనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పుర్రె గుర్తు తీసుకొచ్చిందని, ఇవాళ బీజేపీ వాళ్లు జీఎస్టీ పెంచారని విమర్శించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పని పనులను కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ కేసీఆర్ చేతిలో బాగుపడుతోంది.. -దొంగల చేతుల్లోకి వెళ్తే నాశనమైతది అని చెప్పారు. 

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ నాయకులు కొట్లాడుకుంటున్నారని, ఇలాంటి వారిని గెలిపిస్తే ఆగం అవుతామా..? లేదా..? అని ప్రశ్నించారు. చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు బీఆర్ఎస్ కి చెందిన రామక్క పాటలను కూడా కాపీ కొట్టారని సెటైర్ వేశారు. -రైతులకు సహాయం చేసిన సీఎం కేసీఆర్ ను ఉంచుకుందామా..? చంపుదామా..? అని ప్రశ్నించారు.