ఖమ్మం బాలికకు ప్రభుత్వమే చికిత్స అందించాలి... రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: హరీష్ రావు  

ఖమ్మం బాలికకు ప్రభుత్వమే చికిత్స అందించాలి... రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: హరీష్ రావు  

ఖమ్మం జిల్లాలో రాపర్తిలో అత్యాచారానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. బాలిక విషయాన్ని బయటికి తెచ్చి.. చికిత్స కోసం బాలికను నిమ్స్ లో అడ్మిట్ చేసిన వ్యక్తిని పోలీసులు బెదిరిస్తున్నారని... ఈ ఘటనపై  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అమానుషమని మండిపడ్డారు హరీష్ రావు. బాలికకు ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందించాలని.. కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బాధిత బాలికకు ప్రభుత్వం చికిత్స అందించలేదా అని ప్రశ్నించారు. మందులు ప్రైవేట్ గా తెచుకొమ్మని రాసి ఇస్తున్నారని.. పేదరికంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు హరీష్ రావు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. నిమ్స్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినవారిని శిక్షించాలని అన్నారు హరీష్ రావు.

NCRB డేటా ప్రకారం రాష్ట్రంలో ఏటా క్రైమ్ పెరుగుతోందని...బాలికలపై అత్యాచారాలు ఏటా పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అన్నారు హరీష్ రావు. అత్యాచారాలు దోపిడీలు జరిగితే నిందితులను పట్టుకోవడం లేదని అన్నారు.