తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయెల్ క్షమాపణలు చెప్పాలె

తెలంగాణ ప్రజలకు పీయూష్ గోయెల్ క్షమాపణలు చెప్పాలె

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రబీలో పండని రా రైస్ను ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐ దాడులతో బీజేపీనే ధమ్కీలు ఇస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. పీయూష్ గోయల్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఆయన... కేంద్రానికి కార్పొరేట్లపై తప్ప రైతులపై ప్రేమ లేదని అన్నారు. బీజేపీ నాయకులు ప్రజలవైపా ఉన్నారా లేక పియూష్ వైపు ఉన్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. 

కార్పొరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేసే మోడీ సర్కారు రైతుల కోసం మాత్రం నిధులు ఎందుకు ఖర్చు చేయదని హరీశ్ రావు మండిపడ్డారు. అప్పులు ఎగ్గొట్టే వ్యాపారులకు న్యాయం చేసే బీజేపీ.. రైతులను ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు. అసలు రైతులు లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఉండేదా అన్న హరీశ్.. పీయూష్ గోయెల్ చెంపలేసుకుని క్షమాపణలు చెప్పకపోతే ఆయనను వదిలి పెట్టే ప్రసక్తేలేదని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీకి దమ్ముంటే బాయిల్డ్ రైస్ కొనాలని అన్నారు. దేశానికి అవసరమైన 80శాతం సీడ్స్ తెలంగాణ నుంచి వస్తోందే తప్ప యూపీ, హర్యానా ఇస్తున్నాయా అని ప్రశ్నించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్న బీజేపీ రాష్ట్రానికో నీతి అవలంబిస్తోందని మండిపడ్డారు.