వారం రోజుల్లో కన్నెపల్లి మోటార్లు ఆన్ చెయ్యాలి: హరీశ్ రావు

వారం రోజుల్లో కన్నెపల్లి మోటార్లు ఆన్ చెయ్యాలి: హరీశ్ రావు

వారం రోజుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేసిన రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. లేకపోతే కేసీఆర్ ఆధ్వర్యంలో జిల్లాల నుంచి లక్షలాది మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామన్నారు. ఇవి తాను చెబుతున్న మాటలు కాదని..స్వయంగా కేసీఆర్ చెప్పారని..ఆయన డైరెక్షన్ మేరకే ఇవాళ ప్రెస్ మీట పెట్టానని చెప్పారు హరీశ్. 


తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. శ్రీశైలానికి వరదలు వచ్చి నెల రోజులవుతున్నా మోటార్లు ఆన్ చేయట్లేదు.  కన్నెపల్లి పంప్ హౌజ్ ఆన్ చేస్తే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వాడుకోవచ్చు.  మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చు. వారం రోజుల్లో ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకపోతే  మేమే కన్నెపల్లి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తాం. కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తాం.   

►ALSO READ | మహబూబ్ నగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి

రేవంత్ పాలమూరు ప్రజల కడుపు కొడుతుండు. శ్రీశైలానికి నీళ్లు వచ్చి36 రోజులైంది ఇప్పటి వరకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయట్లేదు. బీఆర్ఎస్ పై కోపంతో ప్రభుత్వం రైతులకు శిక్ష వేస్తోంది. బీజేపీ,కాంగ్రెస్ కుమ్మక్కయింది. ఎస్ఎల్ బీసీ కుప్పకూలిపోతే ఎన్డీఎస్ ఏ ఎందుకు రావట్లేదు. ఎన్డీఎస్ యే పేరుతో ప్రభుత్వం కాలయాపనచేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కు ఎందుకు రిపేర్లుచేయట్లేదు.   గోదావరి నీళ్లను ఒడిసి పట్టుకోవడంలో ప్రభుత్వం ఫెయిల్. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై బురదజల్లుతోంది. రేవంత్ ప్రభుత్వం స్విచ్ఛాఫ్ మోడ్ లో ఉందని హరీశ్ ధ్వజమెత్తారు.