ధాన్యం కొనుగోళ్లలో బీజేపీది రెండు నాల్కల ధోరణి 

ధాన్యం కొనుగోళ్లలో బీజేపీది రెండు నాల్కల ధోరణి 

సిద్దిపేట జిల్లాలోని మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య సంఘాలకు రూ.4 కోట్ల 61 లక్షల 93 వేల కమిషన్ చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. వానాకాలం 2020,21 సీజన్ కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందించారు. కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ ప్రభుత్వం రూ.11 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, పేదలకు మాత్రం ఏ ఒక్క మంచి పని చేయలేదన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచిందంటూ మండిపడ్డారు. కేంద్రం వరి ధాన్యం కొనకపోవడంతో రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లు భరించి ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీది రెండు నాల్కల ధోరణి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన