నిమ్స్, యూకే డాక్టర్ల టీమ్​ను సన్మానించిన మంత్రి హరీశ్​రావు

నిమ్స్, యూకే డాక్టర్ల టీమ్​ను సన్మానించిన మంత్రి హరీశ్​రావు

హైదరాబాద్: ఢిల్లీ ఎయిమ్స్​తర్వాత నిమ్స్​లోనే చిన్నపిల్లలకు అరుదైన గుండె సర్జరీలు జరగడం గొప్ప విషయమని మంత్రి హరీశ్​రావు అన్నారు. నిమ్స్ లో చిన్నారులకు విజయవంతంగా గుండె సర్జరీలు చేసిన యూకే డాక్టర్ల టీమ్​ను మంత్రి సన్మానించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యూకే టీమ్​4 రోజుల్లో 9 మంది చిన్నారులకు సర్జరీలు చేసిందన్నారు.  నిమ్స్ లో కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, 2 వేల పడకలతో నిమ్స్ హాస్పిటల్ ని విస్తరిస్తున్నామన్నారు.