
పటాన్ చెరు నియోజకవర్గంలోని బీరంగూడ-కిష్టారెడ్డిపేట రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. బీరంగూడగుట్టపై 61 కోట్ల ఖర్చుతో 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ ను ప్రారంభించారు. రిజర్వాయర్ ప్రారంభంతో అమీన్ పూర్ కు తాగునీటి సమస్య శాశ్వతంగా తొలగిపోయిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలోనూ బీరంగూడ రోడ్డుకు 49 కోట్లు ఇచ్చామన్నారు హరీష్. అభివృద్ధి కార్యక్రమాల్లో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం వల్లనే అమీన్ పూర్ కు మంచినీళ్లు వచ్చాయని మంత్రి అన్నారు. అమీన్ పూర్ అక్కాచెల్లెళ్లకు ఇవాళే నిజమైన పండుగని.. అనేక సంక్షేమ పథకాలతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు మంచినీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేశామని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చిందని తెలిపారు మంత్రి హరీష్.