
యువత వ్యవసాయం, పరిసరాల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సెల్ ఫోన్లకు బానిసలు కాకుండా…తల్లిదండ్రులకు వ్యవసాయంలో సాయంగా ఉండాలన్నారు. సెల్ ఫోన్ ను టైమ్ పాస్ కోసం కాకుండా వ్యవసాయానికి అనుసంధానం చేసి…మంచి దిగుబడులు సాధించేలా కృషి జరగాలని చెప్పారు. వ్యవసాయానికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందన్న హరీష్… కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్, తోర్నాల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.