గజ్వేల్ లో రూ.కోటితో చాకలి ఐలమ్మ భవనం: హరీశ్

గజ్వేల్ లో రూ.కోటితో చాకలి ఐలమ్మ భవనం: హరీశ్

సిద్దిపేట జిల్లా :  చాకలి ఐలమ్మ స్పూర్తితోనే తెలంగాణ  పోరాటం చేశామన్నారు మంత్రి హరీశ్ రావు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో  చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాటపటిమ గురించి కొనియాడారు.  గజ్వేల్ లో కోటీ రూపాయలతో ఐలమ్మ భవనం నిర్మిస్తామన్నారు.  మరో పదిహేను రోజుల్లో రూ.40లక్షలతో ఈ భవనం చుట్టూ కాంపౌండ్ వాల్,బాత్రూం వంటి నిర్మాణాలు చేయిస్తామన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఆశయమన్నారు..