కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు మంత్రి హరీశ్ రావు. జగిత్యాలలో మంత్రి పర్యటించారు. నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ బిల్డింగ్ లను పరిశీలించారు. తర్వాత మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. 18 కోట్ల ఖర్చుతో 100 పడకల మాతా శిశు హాస్పిటల్ ఏర్పాటు చేసామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవాలు పెరిగేలా ANMలు, ఆశావర్కర్లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరి అయిన వారికి మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేలతో పాటు కేసీఆర్ కిట్ ఇస్తున్నామన్నారు. నార్మల్ డెలివరీలు ప్రోత్సహించాలన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మందులు లేవని బయటకు రాస్తే... డాక్టర్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఉదయం 9 గంటలకే వైద్యులు పీహెచ్ సీలకు రావాలన్నారు. త్వరలోనే అన్ని పీహెచ్ సీల్లో సీసీ కెమెరాలు పెట్టిస్తామన్నారు. మీరు పని సరిగ్గా చేస్తే.. జీతం పెంచే బాధ్యత తమదేనన్నారు. తాను ఇకపై ఆశావర్కర్ల నుంచి కలెక్టర్ వరకు వైద్య పరిస్థితులపై ఫోన్లు చేస్తానన్నారు. ఎవరు పనిచేయకపోయినా వాళ్ల సంగతి నేను చూస్తా... తన సంగతి కేసీఆర్ చూసుకుంటారన్నారు.
