బావ.. మళ్లీ కుదరదేమో..! హరీష్ రావుతో కేటీఆర్

బావ.. మళ్లీ కుదరదేమో..! హరీష్ రావుతో కేటీఆర్

హైదరాబాద్ లోని రాష్ట్ర సెక్రటేరియట్ లో కొత్త భవనం భూమిపూజ సందర్భంగా హరీష్ రావు- కేటీఆర్ హాజరయ్యారు. వీరిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఐతే.. ఈ ఇద్దరి మధ్య సంభాషణ చూసేవారిని ఆకట్టుకుంది. బావ – బామ్మర్ది మాట ముచ్చట ఇలా జరిగిందంటూ అక్కడ ఉన్న రిపోర్టర్లు, అధికారులు చర్చించుకున్నారు.

కొత్త సచివాలయం భూమిపూజ సందర్భంగా బావ బామ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ మధ్య సరదా సంభాషణ జరిగింది. “బావ…మళ్లీ కుదరదేమో…ఒకసారి మన పాత చాంబర్లు చూసుకుందాం” అంటూ బావ హరీష్ రావుతో బావమరిది కేటీఆర్  అన్నారు. దీనికి సరేనంటూ.. హరీష్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

హరీష్ , కేటీఆర్ లతో అభిమానుల సెల్ఫీ సంబురం

హరీష్ రావు, కేటీఆర్ లతో అక్కడికి వచ్చిన నాయకులు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అడిగినవారికి సెల్ఫీలు ఇస్తూ.. ఫొటోలు దిగారు బావ బామ్మర్దులు.