- నిర్మల్ జిల్లాలో యువకుడు మృతి
కుభీర్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థి ప్రచారం కోసం టెంట్ వేస్తుండగా కరెంట్ షాక్ తో యువకుడు మృతిచెందిన ఘటన నిర్మల్జిల్లాలో జరిగింది. కుభీర్మండల కేంద్రానికి చెందిన రాంబోల్ నవీన్ కుమార్(26), శ్యామ్ కలిసి ఆదివారం సిరిపెల్లి తండా –-1 సర్పంచ్అభ్యర్థి కిషోర్ ప్రచారం కోసం చేనులో టెంట్ వేస్తున్నారు. ప్రమాదవశాత్తు 11 కేవీ వైర్లకు తగలడంతో నవీన్, శ్యామ్ విద్యుత్ షాక్కు గురై సృహతప్పి పడిపోయారు.
స్థానికులు వెంటనే బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందగా, శ్యామ్ పరిస్థితి నిలకడగా ఉంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
