చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవర ప్రసాద్ గారు’. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూర్తి షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి రెండు రోజులు ముందు అంటే సోమవారం విడుదల కావడం వల్ల, ఈ సినిమాకు పండుగ సెలవులు పూర్తిగా కలిసిరానున్నాయని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రెడ్ కార్‌పై బ్లాక్ సూట్‌లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్‌తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ సినిమాని మే నెలలో మొదలుపెట్టాం. మెగాస్టార్ చిరంజీవి గారితో ఓపెనింగ్ ముహూర్తంతో స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలల జర్నీ నాకు చాలా మెమొరబుల్. ఇందులో చిరంజీవి గారిని ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించడానికి వందశాతం ఎఫర్ట్ పెట్టాను’ అని చెప్పాడు. నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పాల్గొన్నారు.
