
మంత్రి హరీశ్ రావుపై ప్రశంసలు కురిపించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. హరీశ్ నుంచి నేర్చుకోవాలంటే అతనో ఓ పుస్తకం లాంటి వారని కొనియాడారు. ఆయనో యుద్ధ నాయకుడని.. ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటామన్నారు. కోమటి చెరువు సమీపంలో 25 కోట్లతో నిర్మించనున్న శిల్పారామంకు శంకుస్థాపన చేశారు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్. సిద్ధిపేట తెలంగాణకు ఒక మోడల్ అని.. త్వరలోనే కోమటి చెరువు మంచి టూరిజం స్పాట్ గా ఏర్పడుతుందన్నారు కొప్పుల.
కోమటి చెరువు దగ్గర అర్టిఫిషియల్ బీచ్
సిద్ధిపేట సిగలో మరో మణిహారం శిల్పారామం అని మంత్రి హరీశ్ రావు అన్నారు .సిద్ధిపేటకు విమానం, సముద్రం రెండే లేవన్నారు. త్వరలో కోమటి చెరువు దగ్గర ఆర్టిఫిషియల్ బీచ్ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే నెలలో డైనాసార్ పార్క్ రాబోతుందని.. కోమటి చెరువు చుట్టూ ఓ ప్రపంచాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఆలయాల ఖిల్లా, రిజర్వాయర్ ల జిల్లా సిద్దిపేట జిల్లా అని తెలిపారు హరీశ్.