సీఎం కేసీఆర్ కారణ జన్ముడు: హరీశ్ రావు

సీఎం కేసీఆర్ కారణ జన్ముడు: హరీశ్ రావు

సీఎం కేసీఆర్ కారణ జన్ముడని మంత్రి హరీశ్ రావు అన్నారు.  కేసీఆర్  లేకపోతే  తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. సిద్దిపేట జిల్లా  జగదేవ్ పూర్ లో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ విజేతలకు హరీశ్ రావు  ట్రోఫిలను అందజేశారు.  కేసీఆర్ జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నీని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.  

దేశానికే ఆంధ్రప్రదేశ్ అన్నం పెడుతుందని హరీశ్ రావు తాను తినిపిస్తేనే తెలంగాణ వాళ్లు అన్నం తిన్నారని చంద్రబాబు అంటుండు... ఇంకా నయం చార్మినార్ కూడా తానే కట్టానని అంటాడేమోనని హరీశ్  ఎద్దేవా చేశారు.  ఏపీలో  వరి సాగు 16 లక్షల ఎకరాలు,  తెలంగాణ లో 54 లక్షల ఎకరాల వరి నాట్లు వేశారని చెప్పారు. తెలంగాణ పథకాల గురించి పోక్సన్ కంపెనీ ప్రతినిధి ఆశ్యర్యపోయాడని హరీశ్ రావు అన్నారు.   కేసీఆర్ ను  తైవాన్ దేశానికి రావాల్సిందిగా కోరారని చెప్పారు.