
గోదావరి బనకచర్లను కొనసాగిస్తున్నామని తెలంగాణకు కేంద్రం లేఖ రాసిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూడదు కానీ బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసిందన్నారు. కేంద్రం చర్యలపై సీఎం రేవంత్ సుప్రీంకోర్టుకు వెళ్లకుండా మొద్దు నిద్రపోతున్నారని ఫైర్ అయ్యారు హరీశ్.బనకచర్లపై తాము చేసిన హెచ్చరికలే నిజమవుతున్నాయని చెప్పారు.
తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. వరద జలాలపై పంపిణీ ఎప్పుడూ నికర జలాలపైనే జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు పెను ప్రమాదంగా మారుతోంది. వరద జలాలపై ప్రాజెక్టులు కట్టలేరు. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తోంది. బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే తెలంగాణ పట్టించుకోవట్లేదు. కృష్ణ జలాలను పైన కర్ణాటక, కింద ఏపీ మళ్లించుకుంటే రాష్ట్రానికి నష్టం. గోదావరి నీళ్లను కృష్ణా నదికి మళ్లిస్తే..ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. 423 టీఎంసీలు ఏపీ మళ్లించుకుంటోంది. మేం కూడా 112 టీఎంసీలు మళ్లించుకుంటామని కర్ణాటక లేఖ రాసింది. కృష్ణా నది జలాలను మేం ఆపు కుంటామని కర్ణాటక అంటోంది. వరద జలాలపై మేం కూడా ప్రాజెక్టులు కడతామని మహారాష్ట్ర అంటోంది. తెలంగాణకు అన్యాయం జరుగుతోన్న సీఎం స్పందించట్లదేు. దీని వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు హరీశ్ .