- సర్వేలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నయ్
- సింగరేణి బొగ్గు స్కాములో సీఎం రేవంత్‍కు కేంద్రమంత్రి కిషన్‍రెడ్డి సహకరిస్తుండు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
వరంగల్, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం... వచ్చే ఎన్నికల్లో బీఆర్‍ఎస్ పార్టీ 88 సీట్లు గెలుస్తుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. ‘సర్’ కార్యక్రమంపై హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‍ఎస్ పార్టీ ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను హిట్లర్‌నని, అతడిని చూసే హైడ్రా పెట్టిన అని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి చివరికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. రేవంత్‍రెడ్డి చేస్తున్న తప్పులకు, అవినీతికి కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు క్షమాపణలు చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో పిల్లల బట్టలు, చెప్పులు, సింగరేణి బొగ్గు, హ్యామ్ రోడ్ల టెండర్లు, బ్రూవరీ పర్మిషన్లలో స్కామ్ జరిగిందని ఆరోపించారు.
రామగుండం, భూపాలపల్లిలో రూ.1600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు స్కాం జరిగిందని, మట్టి కుప్పలపై బొగ్గుపేర్చి లెక్కలు చూపిన విషయాన్ని వీడియోలతో బయటపెట్టినట్లు చెప్పారు. జైపూర్ పవర్ ప్లాంట్ స్కాంపై అడిగితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పకుండా, తనపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. సింగరేణి బొగ్గు స్కాం నుంచి సీఎం రేవంత్‌రెడ్డిని కాపాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తున్నారన్నారు. బీఆర్‍ఎస్ హయాంలో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నదన్నారు. పోలీసులు అడ్డగోలుగా కేసులు పెడితే వదిలేది లేదంటూ హెచ్చరించారు. అనంతరం బీఆర్‌ఎస్ నేత రెడ్డిపురం రంజిత్‌రెడ్డి సహకారంతో 500 మంది స్టూడెంట్లకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీమంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‍రెడ్డి
పాల్గొన్నారు.
