కరోనాను ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యవస్థ

కరోనాను ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యవస్థ

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కేవలం మూడు మెడికల్ కాలేజ్ లు మాత్రమే వచ్చాయన్నారు మంత్రి హరీశ్ రావు. ఆరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అన్నారు. తెలంగాణకు కేంద్ర తీవ్ర అన్యాయం చేసిందన్నారు మంత్రి హరీశ్ రావు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో  700 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవన్నారు. ప్రస్తుతం 2వేలకు పైగా సీట్లు పెంచామన్నారు. కరోనా వంటి మహమ్మారి వైరస్ లు వచ్చినా ఎదుర్కునేలా ఐదంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. నిమ్స్ తో పాటు మరో ఐదు సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నిమ్స్ లో మరో 2వేల పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు హరీశ్ రావు. ప్రొఫెసర్స్ పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. 

మరిన్ని వార్తల కోసం

ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే జాబ్స్‌‌ నుంచి తీసేస్తరా?

గోవులను తీసుకెళ్లేందుకు అంబులెన్స్​