కరోనా టైంలో రైతుకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

కరోనా టైంలో రైతుకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

దేశానికి అన్నం పెట్టిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు మంత్రి హరీశ్ రావు. భూమికి బరువయ్యేంత పంట పండించేందుకు టీఆర్ఎస్  ప్రభుత్వం కృషి చేసిందన్నారు.  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతనంగా నియమితులైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంజాబ్, హర్యానా కంటే ముందు వరుసలో ఉన్నామన్నారు. బీహార్ నుంచి వచ్చి వ్యవసాయ పనులు చేసే పరిస్థితికి తెలంగాణ చేరుకుందన్నారు. వాన చినుకు భూమిపై పడకముందే రైతు బంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. మండుటెండల్లో కూడవెల్లి వాగు ప్రవహిస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు. సాగునీరు అయినా త్రాగునీరు అయినా 70ఏండ్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్లు ఇచ్చిండా అని ప్రశ్నించారు.  కరోనా సమయంలో కూడా  టిఆర్ఎస్ ప్రభుత్వం.. రైతుకు కొండంత అండగా ఉందన్నారు. ఓపిక పట్టిన కార్యకర్తకు తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు.త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు.