ప్రభుత్వ హాస్పిటల్స్‌‌ అధ్వానంగా మారాయి : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

ప్రభుత్వ హాస్పిటల్స్‌‌  అధ్వానంగా మారాయి : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు
  • సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : ‘కాంగ్రెస్‌‌ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్స్‌‌ అధ్వానంగా మారాయి, కేసీఆర్‌‌ కిట్‌‌, న్యూట్రిషన్‌‌ కిట్‌‌ వంటివి బంద్‌‌ అయ్యాయి’ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు విమర్శించారు. సిద్దిపేటలోని క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌‌ మళ్లీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, మరోసారి బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

 కాంగ్రెస్‌‌ ప్రభుత్వం భార్యకు ఫ్రీ బస్‌‌ ఇచ్చి.. భర్తకు డబుల్‌‌ కొడుతోందని ఎద్దేవా చేశారు. మార్కెట్‌‌లో మక్కలు ఉన్నా.. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌‌లో పనిచేసే వారికి ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. అనంతరం 297 మందికి రూ. 60 విలువైన సీఆర్‌‌ఎఫ్‌‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం సిద్దిపేట వైశ్య భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.