చింతలేని గ్రామంగా చింతమడక : హరీష్‌ రావు

చింతలేని గ్రామంగా చింతమడక : హరీష్‌ రావు

సీఎం కేసీఆర్ రాకతో చింతలేని గ్రామంగా చింతమడక మారుతుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు. సీఎం కేసీఆర్‌ చింతమడక పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు చింతమడక బాసటగా నిలిచిందన్నారు. ఆమరణ దీక్ష సమయంలో చింతమడకలో ఒక్క ఇంట్లోనూ పొయ్యి వెలగలేదని చెప్పారు. ఉద్యమంలో మీరంతా కేసీఆర్‌ను వెన్నంటి ఉన్నారన్నారు. చింతమడక వాసులతో ఆత్మీయానురాగాలు పంచుకునేందుకు కేసీఆర్‌ వచ్చారని తెలిపారు. కేసీఆర్‌ రాకతో బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు ఒక్కసారి వచ్చినట్లుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడంతో పాటు… ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని హామీ ఇచ్చారు. చింతమడక పరిసర గ్రామాలకు రహదారులు కావాలని విజ్ఞప్తులు అందాయన్న హరీష్… ఇక్కడ అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాం అన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నిధుల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. సిద్దిపేట పట్టణంలో మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నానని తెలిపారు హరీష్‌.