మంత్రిగా రెండోసారి: హారీష్ రావు రాజకీయ ప్రస్థానం

మంత్రిగా రెండోసారి: హారీష్ రావు రాజకీయ ప్రస్థానం

టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన.. హరీశ్ రావు రెండోసారి మంత్రి అయ్యారు. ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై హరీష్ రావుచేత ప్రమాణం చేయించారు. జూన్ 3 1972లో హరీశ్ జన్మించారు. సిద్దిపేట నుంచి 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ప్రారంభం నుంచి గులాబీ పార్టీలో ఉన్న హరీశ్… ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. యూపీఏ సర్కార్ తెలంగాణ ఏర్పాటును జాప్యం చేస్తుందని.. 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సిద్దిపేట నుంచి మళ్లీ గెలిచారు. 2009 డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిన వెనక్కి తీసుకోవడంతో మళ్లీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు హరీశ్. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు స్థాయిలో 95వేల 858 ఓట్లు మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత.. 2014 సాధారణ ఎన్నికలతో పాటు.. 2018 ముందస్తు ఎన్నికల్లోనూ రికార్డుస్థాయి మెజార్టీలతో గెలిచారు హరీశ్ రావు. స్వరాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా.. శాసనసభా వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.